తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా సాయి, ఫహీమ్.మహాసభలో ఆమోదించిన తీర్మాణాలపై పోరాటాలు సాగిస్తాం. అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా అనుముల సాయి, ఎస్కే ఫహీమ్ దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మంది ఆఫీస్ బేరర్స్, 73 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటికైనా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు విక్రయించే విధానాన్ని నిలిపేయాలని ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విద్యవైద్యం ఉపాది రంగాల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ నిరంతర పోరాటాలు సాగిస్తుందన్నారు. జిల్లాలోని ప్రజా, యువజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏఐవైఎఫ్ మహాసభలో ఆమోదించిన తీర్మాణాల అమలుకు భవిష్యత్ పోరాట కార్యచరణ చేపడతామని ఈ సందర్భంగా సాయి, ఫహీం పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ