తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ జాతీయ రహదారిపై అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కాలువ పనులను 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొబ్బరికాయ కొట్టి కాల్వపనులను ప్రారంభించారు. శుక్రవారం 16వ డివిజన్లోని జాతీయ రహదారిపై నూతన కాలువ పనులను ప్రారంభించిన మునిగడప పద్మ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి నిర్వీర్యంగా కాలువలో నీళ్ళు పోకుండా జాతీయ రహదారిపై బురద నీళ్లు ప్రవహిస్తున్న సమస్యకి స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చొరవతో నేడు కాలువ నిర్మాణం జరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే కాలువ నిర్మాణం పనులు జరగడానికి సహకరించిన కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డి ఈ నవీన్ రెడ్డిలకు, వర్క్ ఇన్స్పెక్టర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న పాతకాలపై నిర్మాణాలు చేపట్టి కాలువలో నీళ్ళు పోకుండా చేయడం ద్వారా మురికినీరంత జాతీయ రహదారిపై ప్రవహించడంతో దుర్గంధం వెదజల్లుతూ, వాహనదారులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. కార్పొరేటర్ మునిగడప పద్మ కృషితో గత గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ సమస్యకు తెరపడుతున్నట్లు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సహచర15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరు సుప్రియ, నాయకులు సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెంకటేశ్వర్లు, రామవరం ప్రముఖులు ప్రమోద్ అగర్వాల్, రమణ, ఉమాకాంత్, జలీల్, వ్యాపారస్తులు, షాప్ ల యజమానులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ