Thursday, 17 September 2026 12:51:41 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

Date : 06 June 2026 07:10 PM Views : 131

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలను, 02 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి డిఎస్పి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, గంజాయి,మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించవలసిందిగా కోరారు.మహిళలు & పిల్లల భద్రత గురించి పలు సూచనలు చేశారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి వారి పరిష్కారాన్ని కృషి చేస్తానని, విపత్కర సమయాలలో ఆపదలో ఉన్నప్పుడు డేల్ 100నకు ఫోన్ చేసి పోలీసువారి సేవలు పొందాలని సూచనలు చేశారు. సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు.ఈ ఆపరేషన్ లో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ మరియు స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నీఫర్ డాగ్ పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :