తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న ఉచిత సెమీ రెసిడెన్షియల్ పోలీస్ కోచింగ్ కార్యక్రమాన్ని జూలూరుపాడు మండలానికి చెందిన అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జూలూరుపాడు ఎస్‌ఐ కోరారు.జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్‌కు అవసరమైన శిక్షణను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.అభ్యర్థులకు ఉచిత క్లాస్‌రూమ్ కోచింగ్, ఫిజికల్ ట్రైనింగ్, స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ప్రతి ఆదివారం వారపు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.జూలూరుపాడు మండల పరిధిలోని పోలీస్ ఉద్యోగాలను ఆశిస్తున్న అర్హులైన నిరుద్యోగ యువత 31.08.2026లోపు జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అనంతరం 06.09.2026న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి కోచింగ్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న ప్రతి యువకుడు, యువతి ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి, శారీరకంగా కూడా సిద్ధమై ఉద్యోగం సాధించాలని జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐపీఎస్ పిలుపునిచ్చారు.జూలూరుపాడు మండలంలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఇతరులకు కూడా తెలియజేసి, పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ తరఫున కోరుతున్నాము.
Admin
తెలుగు వెలుగు టీవీ