తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు కొమ్మినేని పాండురంగారావు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీ ల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ధాన్యంలో తేమశాతం 17 కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని, తూకం వేసి ఆన్లైన్ లో అప్లోడ్ కాగానే తక్కువ పరిమిత టైంలో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-ఆపరేటివ్ పర్యవేక్షణ సీనియర్ ఇన్స్పెక్టర్ వరుణ్, మండల వ్యవసాయాధికారి దీపక్ ఆనంద్, సహకార సంఘం సీఈవో లంకా నరసింహారావు, డిసిసిబి మేనేజర్ మానుష మరియు సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ