Wednesday, 16 September 2026 11:27:19 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ. ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం. రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌గా నిలుస్తోంది..

Date : 17 September 2025 07:22 PM Views : 508

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే కుల గణన.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి కి ఇల్లందు క్రాస్ రోడ్ లో గల సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐ డి ఓ సి కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ లో కార్యక్రమానికి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ప్రజలకు తన సందేశాన్ని అందించారు.. ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ చరిత్రలో గర్వకారణమైన రోజు అని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు సంస్థానం భారతదేశంలో కలిసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు, ప్రజా పోరాట యోధుల త్యాగం వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని ఈ రోజు అందరికీ గుర్తు చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దార్శినిక నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో ప్రజల హక్కులు కాపాడబడుతున్నాయని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా వంటి పథకాల ద్వారా రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌గా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. సీతారామ ప్రాజెక్ట్‌తో నీటి కల నెరవేరిందని, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనతో జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని, భద్రాచలానికి రాకపోకల సౌకర్యం కల్పించేలా రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్, బైపాస్ రోడ్, నేషనల్ హైవే పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, భవిష్యత్‌లో థర్మల్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తరువాత ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి , విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవాన్ విరాట్ విశ్వకర్మ గారు విశ్వశిల్పి, దేవశిల్పి, ఆకాశానికి, భూమికి, దేవాలయాలకు, రథాలకు, ఆయుధాలకు రూపకర్తగా నిలిచారని వివరించారు. దేవతలకు కావలసిన నిర్మాణాలు, నగరాలు, ఆభరణాలు, శిల్పకళా నిర్మాణాలు అన్నీ విశ్వకర్మ గారి సృష్టి ఫలితమని ఆయన అన్నారు. విశ్వకర్మ ఆవిష్కరణలు, శిల్పకళ, శ్రమ విలువను గుర్తిస్తూ ఆయనను అద్యబ్రహ్మగా పూజిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, కూలీలు, శ్రమజీవులు, చేతివృత్తిదారుల ప్రతిభ, కృషి వల్లే సమాజం ముందుకు సాగుతుందని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీసీల కుల గణన కూడా ఈ వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి చేపట్టిన ఒక చారిత్రక అడుగు అని తెలిపారు. ఈ కుల గణనను అందరూ సమర్పించి అక్కడకు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు, కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి వర్గానికి చేరేలా చూడటం మనందరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, బీసీ సంఘం నాయకులు వెంకటాచారి , వారాధి సత్యనారాయణ , బసవపాత్రుని తిరుపతి , వారాధి రామాచారి , బి. సాంబయ్య , ఎస్. కృష్ణమాచారి , కూరపాటి లింగాచారి , పొడిచేటి వెంకటాచారి మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :