తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 01.10.2026 అర్హత తేదీగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో భాగంగా క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో 05.09.2026, 06.09.2026 మరియు 12.09.2026, 13.09.2026 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఓటర్లు సంబంధిత పోలింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే లేదా కొత్తగా పేరు నమోదు, తొలగింపు, మార్పులు అవసరమైతే నిర్ణీత ఫారం-6, ఫారం-7 మరియు ఫారం-8 ద్వారా సంబంధిత BLO/EROలకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ప్రత్యేక ప్రచార దినాల్లో సంబంధిత BLOలు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారు. కావున, జిల్లాలోని ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ