Wednesday, 04 November 2026 03:55:56 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ... ఎఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

Date : 10 August 2025 06:04 PM Views : 608

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం శేషగిరిభవన్ లో ఆదివారం ఉదయం కార్మికుల సమస్యల పై గుర్తింపు సంఘం ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు,అనంతరం కార్మిక సమస్యల పై మీడియా తో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి భవిష్యత్ కోసం సంస్థ అధికారులు దృష్టి పెట్టీ 1/70 యాక్ట్ లో ఉన్న కోయగూడెం ఓసి ,గోదావరిఖని లోని తాడిచర్ల 2, భూపాలపల్లి లోని వెంకటాపూర్ ఓసీ, సత్తుపల్లి ఓసీ 3 లలో బొగ్గును ప్రైవేటు వారికి ఇవ్వకుండా సింగరేణి నే తీయాలి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సీతారామయ్య డిమాండ్ చేశారు. యాజమాన్యం ఈ విషయం మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణి లో జరుగుతున్న కుంభకోణల మీద విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టకపోవడం పట్ల గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వ జోక్యం వల్ల ఎక్స్ప్లోసివ్ టెండర్ ల లో సుమారు సింగరేణి సంస్థ కు 450కోట్ల నష్టం జరిగిందనీ అదే విధంగా ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ లో అనేక కుంభకోణలకు పాల్పడుతున్న అవినీతి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్న యాజమాన్యం సాధారణ ఉద్యోగులు చేసే చిన్న చిన్న పొరపాట్ల మీద వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయం ఉండరాదని స్పష్టం చేశారు. సంస్థ సి&ఎండి, డైరెక్టర్ల స్ట్రక్చర్ సమావేశం లో ఒప్పుకున్న పలు కార్మిక సమస్యల పై వెంటనే సర్క్యులర్ లు యాజమాన్యం విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనింగ్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగులు మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సర్ఫేస్ లో సుటబుల్ జాబ్ ఇవ్వాలని ఈపి ఆపరేటర్లకు డి నుండి సీ, సీ నుండి బీ గ్రేడ్ ఉద్యోగులకు వెకెన్సీస్ తో సంబంధం లేకుండా ప్రమోషన్ లు ఇవ్వలని అదేవిధంగా మారుపేర్ల విషయం పై అడ్వకేట్ జనరల్ దగ్గర ఉన్నందున యాజమాన్యం మారు పేర్ల సమస్యని వెంటనే పరిష్కారం అయ్యేవిధంగా ప్రభుత్వం తో పాటు అడ్వకేట్ జనరల్ ను సంప్రదించి సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేవిధంగా చూడాలనీ డిమాండ్ చేశారు. గతంలో జరిగిన మెడికల్ బోర్డు లో 55 మంది బోర్డుకు హాజరవ్వగా ఐదుగురు మాత్రమే అన్ఫిట్ చేశారు అని మిగిలిన 50 మందికి మళ్ళీ మెడికల్ బోర్డు పెట్టాలి అని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ మాట్లాడుతూ కార్మికులకు వెంటనే 200 గజాల స్థలం ఇచ్చి గృహా నిర్మాణానికి కోల్ ఇండియా తరహా లో ఏవిధంగా అయితే వడ్డీ లేని రుణం 30లక్షలు మంజూరు చేస్తుందో అదే విధంగా సింగరేణి కార్మికుడికి కూడా రుణం కల్పించి సొంత ఇంటికల నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. గడిచిన ఫైనాన్షియల్ సంవత్సరం లో అసలు లాభాలు ఎంత వచ్చాయో స్పష్టంగా తెలిపి వాస్తవ లాభాల పై 35శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్లరికల్ ఖాళీలు వెంటనే భర్తీ చెయ్యాలనీ కోర్టు కి వెళ్లిన 110మంది నీ మినహాయించి మిగత ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, కతర్ల రాములు, సందేబోయిన శ్రీనివాస్, హుమాయూన్, మీడియా ఇంచార్జి కమల్,రాము,సాంబమూర్తి, మధుకృష్ణ, మర్రిగోపి,మండల రాజేశ్వరరావు,కోటి, ఏం ఆర్ కె ప్రసాద్, గోపి,తిరుపతి, రాంశంకర్,మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :