Wednesday, 16 September 2026 09:07:35 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యాన కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల వైఫల్యాలను ఎండగడుతూ కొత్తగూడెంలో భారీ నిరసన ప్రదర్శన.

Date : 02 September 2026 07:26 PM Views : 106

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యాన కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల వైఫల్యాలను ఎండగడుతూ కొత్తగూడెంలో భారీ నిరసన ప్రదర్శన.అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: ఎంపీ వద్దిరాజు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లే: ఎంపీ వద్దిరాజు.కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి పాపంలా,శాపంగా మరింది: ఎంపీ వద్దిరాజు.కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే,అవి రెండు కలిసి పనిజేస్తూ బీఆర్ఎస్ ను అణచివేయాలని కుట్ర చేస్తున్నాయి: ఎంపీ వద్దిరాజు.తెలంగాణ రాష్ట్రానికి,ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష.అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నోటికొచ్చినట్టు 432 హామీలిచ్చి కనబడ్డ ప్రతి దేవునిపై ఒట్టేసి ప్రజల్ని మోసపుచ్చి ఓట్లు దండుకున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.ఏ విధంగానైనా అధికారంలోకి రావాలనే కుట్రపూరిత వైఖరితో కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీ కార్డులు పంచి, 432 హామీలిచ్చి,13 డిక్లరేషన్లతో ప్రజలను దగా చేశారన్నారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యాన భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు.ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇష్టారీతిన హామీలు గుప్పిస్తూ భద్రాచలం సీతారామచంద్ర, యాదాద్రి లక్ష్మీ నరసింహా, వేములవాడ రాజరాజేశ్వర స్వాములతో పాటు కనిపించిన దేవుళ్లు,మసీదు,చర్చిల ఒట్లు వేసి,ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన చెప్పారు.రైతన్నలకు 2 లక్షల రూపాయల చొప్పున 49వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు చివరకు చేసినది 18వేల కోట్లు మాత్రమేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు 10వేల చొప్పున పంట పెట్టుబడి అందజేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు.ఈ విషయాన్ని తాను పార్లమెంటులో వివరించి ఆదర్శవంతమైన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఎంపీ వద్దిరాజు తెలిపారు.రైతుభరోసా పేరిట ఎకరాకు 15వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని సక్రమంగా ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు.ఈ ప్రభుత్వం రైతుబీమా ఎగ్గొట్టిందని,కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని,సాగునీళ్లు లేవు,వరద నీళ్లను కిందకు వదిలిపెడుతూ రేవంత్ రెడ్డి తన గురుదక్షణ చెల్లించుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు.కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని,ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.ఉద్యోగులకు పీఆర్సీ లేదు, 6 డీఏలు లేవు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాక నిరుద్యోగ యువత, ఫీజుల బకాయిలు అందక విద్యార్థులు,ఇస్తామన్న సాయం అందక ఆటో డ్రైవర్లు, కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకపోవడంతో మహిళలు పాలకులపై మండిపడుతున్నారని ఆయన వివరించారు.బీసీ రిజర్వేషన్ల పెంపుదల లేదు,దళితబంధు లేదు,బీసీ బంధు లేదు,సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు, సంక్షేమ పథకాల జాడనే లేదని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు,కట్టడాలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని,అప్పటి నిర్మాణాలను కొన్నింటిని మాత్రం రిబ్బన్ కట్ చేసి ఆర్భాటంగా ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అన్ని వైఫల్యాలే తప్ప అభివృద్ధి జరిగిందేమీ లేదని,వచ్చే రెండేళ్లలో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చీటికిమాటికి అర్థంపర్థం లేకుండా కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావులను తిట్టడంతో బూతుపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఆయనతో పాటు మంత్రులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాలనను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని,ఆ రెండు పార్టీల నాయకులు కలిసే పని చేస్తున్నారని,అధికారంలో లేని బీఆర్ఎస్ ను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి పాపంలా,శాపంగా మారిందన్నారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనతో విసిగి వేసారిన ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.తెలంగాణ రాష్ట్రానికి,ప్రజలకు కేసీఆర్ పాలనయే శ్రీరామరక్ష అని,రక్షణ అని ఆయన స్పష్టం చేశారు.దేవుళ్లందరిపై రేవంత్ రెడ్డి ఒట్లేసినట్టుగానే తాను కూడా ఒట్టేసి చెబుతున్న కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని,ఇది సత్యం,జరిగి తీరుతుందని ఎంపీ వద్దిరాజు ధీమాతో చెప్పారు.కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపాన ఎంపీ రవిచంద్ర వేలాది మందితో మానవహారం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను వివరిస్తూ 420 మీటర్ల భారీ బ్యానర్ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు గులాబీ కండువా ధరించి,జెండాలు చేతబట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :