Wednesday, 16 September 2026 09:53:24 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో జరిగిన హత్య కేసు ఛేదింపు – 23 మంది నిందితుల అరెస్ట్.

Date : 31 August 2026 09:01 PM Views : 382

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎంకే (మణుగూరు ఖంధన్) పేరుతో గ్యాంగ్ ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు.మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో 27.08.2026న జరిగిన సింహాద్రి శివకుమార్ @ శివ హత్య కేసును మణుగూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించగా, వారిలో 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారిని కూడా త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి సింహాద్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.309/2026 U/s 189(2), 103(2), 109(1), 351(3), 61(2) r/w 190 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు సింహాద్రి శివకుమార్ @ శివ గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మణుగూరుకు చెందిన ఈర్ల లోకేష్ మరియు శివ వద్ద పనిచేస్తున్న సతీష్ మధ్య గతంలో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదంలో శివ, సతీష్‌కు మద్దతుగా నిలిచి లోకేష్‌ను అడ్డుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ విషయాన్ని లోకేష్ జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టికి తెలియజేయడంతో జెట్టి, శివను ఫోన్‌లో పలుమార్లు బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివతో ఫోన్‌లో జరిగిన వివాదాలు తీవ్రతరం కావడంతో, శివ మణుగూరుకు వచ్చిన సమయంలో అతనిపై దాడి చేసి హత్య చేయాలని నిందితులు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.27.08.2026న రాఖీ పండుగ సందర్భంగా శివ హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చాడు. అతను తన స్నేహితుడు ఉదయ్ కిరణ్‌తో కలిసి బైక్‌పై నేతాజీ గ్రౌండ్‌కు వెళ్లాడు. అక్కడ అప్పటికే పథకం ప్రకారం వేచి ఉన్న నిందితులు శివపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. శివతో పాటు వెళ్లిన ఉదయ్ కిరణ్‌పై కూడా నిందితులు దాడి చేసి హత్యకు ప్రయత్నించగా, అతను వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. హత్య అనంతరం నిందితులు బైక్‌లపై మణుగూరు రేగులగండి అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ బైక్‌లను దాచిపెట్టి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎంకె గ్యాంగ్‌పై దర్యాప్తులో కీలక విషయాలు దర్యాప్తులో జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి గత కొంతకాలంగా “ఎంకె – మణుగూరు ఖంధన్” పేరుతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి, అందులో పలువురు యువకులను సభ్యులుగా చేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ గ్యాంగ్ సభ్యులు పరస్పరం సంప్రదించుకునేందుకు “టీం ఎంకె” పేరుతో వాట్సాప్ గ్రూప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.గ్యాంగ్ సభ్యులు కలిసి తిరుగుతూ, మద్యం సేవిస్తూ జల్సాలకు పాల్పడటం, గొడవలకు దిగడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన ఇతర కార్యకలాపాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 31.08.2026 ఉదయం సుమారు 8 గంటల సమయంలో మణుగూరు రేగులగండి అటవీ ప్రాంతంలో దాడి చేసి 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి:9 బైక్‌లు,20 సెల్‌ఫోన్లు,1 కర్ర,1 చేతి కడియం స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి,కందుల దినేష్చెన్నబోయిన భరత్ @ CHతోలేం జంపయ్య @ పండురాయల వినయ్మహమ్మద్ సాధిక్నెట్టెం వరప్రసాద్గనిబోయిన సాత్విక్ @ చింటూ గుగులోత్ రమేష్ @ గోబికాండ్రు గణేష్నక్క రాజా @ విక్కీకంగాల సాయి జగన్ @ జగన్ఎదలపల్లి నాగేంద్రబాబు @ కన్నికొమెర చంటిఏనిక దినేష్పున్నం వంశీ శివ @ శివకొమరం హరీష్ @ డాన్ఇర్ప శ్రావణ్కలబోయిన మల్లేష్దేవుళ్ల దుర్గా ప్రసాద్అక్కిరెడ్డి అభినయ్ రెడ్డి @ అభిసోయం నరసింహారావు @ రేకుల్ ఈర్ల లోకేశ్వర్ @ లోకేష్ అరెస్ట్ చేసిన నిందితుల్లో జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి, గుగులోత్ రమేష్ @ గోబిపై గతంలో పేకాటకు సంబంధించిన కేసులు, చెన్నబోయిన భరత్ మరియు కందుల దినేష్‌పై కొట్లాటకు సంబంధించిన కేసులు, గనిబోయిన సాత్విక్ @ చింటూపై డెకాయిటీ కేసు మణుగూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులకు గంజాయి సేవించడం, విక్రయించడం లేదా గంజాయి వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.మణుగూరు పరిధిలో ఎవరైనా వ్యక్తులు ఏ పేరుతోనైనా గ్యాంగ్‌లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, అలాంటి వారిని గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఇలాంటి అసాంఘిక గ్రూపులు, గ్యాంగ్‌లకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.యువత చెడు స్నేహాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మణుగూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :