Thursday, 17 September 2026 04:42:35 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 28 November 2025 05:45 PM Views : 185

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 29న నిర్వహించు తెప్పోత్సవం, 30న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం, కళ్యాణ మండపం, అధ్యయన వేదిక, క్యూ లైన్‌లు, భక్తుల కోసం సెక్టార్‌ వైజ్ ఏర్పాట్లు వంటి అంశాలపై దేవస్థానం అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.మిథిలా స్టేడియం ఉత్తర ద్వారం ప్రాంతంలో క్యూ లైన్‌ల ఏర్పాటు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భద్రతా బలగాల మోహరింపు, త్రాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి చేరుకునే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు పూర్తిస్థాయిలో, నిర్లక్ష్యం లేకుండా చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని, వైద్య విభాగం 24 గంటలు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.ఉత్తర ద్వారం వద్ద బారికేడింగ్, క్యూ లైన్ క‌వ‌ర్లు, లైటింగ్‌, సీసీ కెమెరాలు, సమాచార ప్యానెల్స్ ఏర్పాటు వంటి పనుల పురోగతిని ఇంజినీరింగ్ విభాగం అధికారులు కలెక్టర్‌కు వివరించారు. భద్రతా పరంగా పోలీసు విభాగం, దేవస్థానం విజిలెన్స్, శానిటరీ సిబ్బంది అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయన సూచించారు.భక్తులకు సులభ దర్శనం అందించడం ప్రధానం కావడంతో రెస్టింగ్ పాయింట్లు, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని కలెక్టర్ హెచ్చరించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయాల్లో అదనపు వాలంటీర్లు, సిబ్బంది మోహరించాలని సూచించారు.దేవస్థానం పరిసరాల్లో స్వచ్ఛత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా కీలకమని పేర్కొంటూ, పంచాయతీ శాఖతో దేవస్థానం అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విభాగం రోజువారీ పురోగతి నివేదికను సమర్పించి, నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.ఎటువంటి విభాగం నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరిస్తూ, భక్తుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మొత్తం ఏర్పాట్లను అత్యుత్తమంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె. దామోదర్ రావు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ వి. రవీంద్రనాథ్, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవానీ, రామకృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :