తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కనకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారని చెప్పారు. కావున వెంటనే అధికారులు స్పందించి సమస్య ను పరిష్కరించాలని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ