Wednesday, 16 September 2026 08:21:27 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 06 November 2024 06:36 PM Views : 484

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈసిజీ,గైనకాలజీ,బీపి,షుగర్,దంత సమస్యలు,కళ్ళ పరీక్షలు,ఆర్థోపెడిక్,యురాలాజీ,ఫిజియోతెరపి,గుండె సంభంధిత పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసే విధంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో భర్తీ అయినప్పుడు కఠినమైన శిక్షణతో,పూర్తి శారీరక సామర్థ్యంతో,ఆరోగ్యంగా శిక్షణా కేంద్రాల నుండి ప్రజలకు సేవలు అందించడానికి బయటకు రావడం జరుగుతుందన్నారు.ఆ తర్వాత విధులలో చేరినప్పటి నుండి నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో పాటు,ప్రజలకు సేవలందిస్తూ పోలీసులు విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్నారు.చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందని,అందుమూలంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.పోలీసులు అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు.అందుకే జిల్లాలో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో సబ్ డివిజన్ల వారీగా పోలీసు అధికారులు,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు.ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ గారితో పాటు సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.అదేవిధంగా నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తూ,తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు కూడా వైద్య చికిత్సలు చేయడానికి విచ్చేసిన వైద్య బృందానికి కూడా ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.వైద్య వృత్తి కూడా చాలా బాధ్యతాయుతమైన వృత్తి అని కొనియాడారు.అనంతరం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులందరినీ శాలువాలు,మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,పట్టణంలోని ప్రముఖ వైద్యులయిన నాగరాజు,కృష్ణ ప్రసాద్,రంగారావు, రాజశేఖర్,ప్రవీణ్,సీఐలు వెంకటేశ్వర్లు కరుణాకర్,రమేష్,శివప్రసాద్,ఇంద్రశేనారెడ్డి,ఆర్ఐలు సుధాకర్,కృష్ణారావు,నరసింహారావు,లాల్ బాబు మరియు ఇతర పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :