Wednesday, 16 September 2026 04:46:23 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు.

Date : 10 September 2026 06:14 PM Views : 74

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు భద్రాద్రి జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల,కార్మిక, మరియు పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక TS UTF భావన్ నందు పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ నాయకులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, నిన్నటి చర్చల వివరాలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడటం జరిగింది. జిల్లా ఛైర్మన్ అమరనేని రామారావు మాట్లాడుతూ:రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు నేటి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. నిన్న సీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత, ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. వచ్చే దసరా పండుగ నుంచే పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాలని కోరారు.కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న గౌరవ సీఎస్ మరియు ఉన్నతాధికారుల అధ్యక్షతన రాష్ట్ర జేఏసీతో జరిపిన చర్చల ఫలితంగా, ఈ నెల 18వ తేదీన మలిదశ చర్చలు జరపాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు. ప్రాథమిక సభ్యుడి ఆలోచనలకు అనుగుణంగా స్నేహపూర్వక వాతావరణంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏలు మరియు బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కనీసం మూడు డీఏలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ. 2 వేల కోట్లు కేటాయించాలని, ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రూ. 11 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.PRTU TS జిల్లా అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ: ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. నిన్నటి చర్చలలో భాగంగా సీపీఎస్‌కు సంబంధించిన అంశాలపై పీఆర్సీ నిపుణులు, ఉన్నతాధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని నియమిస్తామని ప్రభుత్వం వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ ద్వారా ఉద్యోగులకు తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అలాగే 18వ తేదీన జరిగే చర్చల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) పై కూడా స్పష్టమైన నిర్ణయం వచ్చేలా చర్యలు ఉండాలని రాష్ట్ర జేఏసీకి సూచించారు.TNGOS జిల్లా కార్యదర్శి భార్గవ చైతన్య మాట్లాడుతూ:ఉద్యోగ సంఘాల నిరసనల తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం, జీఏడీ ద్వారా రాతపూర్వక హామీ ఇచ్చి ప్రకటన జారీ చేయడంతో 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. డిజిటల్ మాధ్యమాలు, సోషల్ మీడియా వ్యాప్తంగా హక్కుల కోసం ఉద్యోగులు చేస్తున్న ఆర్తనాదాలు, నెరవేరని హామీలపై వస్తున్న ఆక్రోశపూరిత పోస్టులే ఉద్యోగుల అసంతృప్తికి అద్దం పడుతున్నాయని అన్నారు. జేఏసీ నాయకత్వం ఎక్కడా వెనక్కి తగ్గకుండా, ఉద్యోగుల ఐక్య బలాన్ని ప్రభుత్వానికి చూపించి చర్చలు టేబుల్‌పైకి తెచ్చేలా చేయడంలో విజయం సాధించిందన్నారు. 18వ తేదీన జరిగే చర్చల్లో ఉద్యోగులకు స్పష్టమైన లబ్ధి జరగకపోతే, వెనువెంటనే ఉత్తర్వులు (జీవోలు) రాకపోతే... 19న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి ప్రాథమిక సభ్యుడిని సంపూర్ణంగా ఒప్పించి, ప్రత్యక్ష పోరాటానికి నాయకత్వం సిద్ధపడాలని, సామాన్య ఉద్యోగి నమ్మకాన్ని గెలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో TNGO రాష్ట్ర కార్యదర్శి వీరబాబు గారు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :