Wednesday, 16 September 2026 06:52:44 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కిన్నెరసాని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల, యానం బైలు పాఠశాల, పల్లె దవాఖాన, రాజాపురం అంగన్వాడీ కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

Date : 12 August 2026 05:05 PM Views : 87

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడా ప్రతిభతో పాటు విద్యలోనూ విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం, పల్లె దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. కిన్నెరసాని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల, యానం బైలు పాఠశాల, పల్లె దవాఖాన, రాజాపురం అంగన్వాడీ కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామం, యానం బైలు, రాజాపురం ప్రాంతాల్లోని పాఠశాలలు, పల్లె దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడా పాఠశాల, యానం బైలు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, యానం బైలు పల్లె దవాఖాన, రాజాపురం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులు, చిన్నారులు, గ్రామీణ ప్రజలకు అందుతున్న విద్య, క్రీడా శిక్షణ, వసతి, భోజనం, వైద్య సేవలు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో సేవల అమలును స్వయంగా పరిశీలించారు.కిన్నెరసాని గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, లైబ్రరీ, క్రీడా ప్రదేశాలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భవనాల పరిస్థితి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారికి వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అందుతున్న సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.తరగతి గదుల్లో విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన కలెక్టర్ వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, ఇతర విద్యా సామగ్రి అందాయా, తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా, ఉపాధ్యాయులు బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటశాలను పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, మెనూ అమలు తదితర అంశాలను పరిశీలించి విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.క్రీడా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న క్రీడా శిక్షణపై కూడా జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులు ఏయే క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు, ఆయా క్రీడల్లో వారి ప్రతిభ ఎలా ఉంది, వివిధ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారా, అవసరమైన క్రీడా సామగ్రి అందుబాటులో ఉందా అనే వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించాలని, అవసరమైన క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. క్రీడా ప్రతిభతో పాటు విద్యలోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు. విద్య, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని అన్నారు.అనంతరం యానం బైలు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలించగా, ఆ రోజు మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం పాఠశాల తరగతి గదులు, ఆవరణ, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.తదుపరి యానం బైలు పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. పల్లె దవాఖానలో నిర్వహిస్తున్న రక్త పరీక్షల నమూనా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె దవాఖానలోని ఔషధ నిల్వలను పరిశీలించిన కలెక్టర్ మందుల లభ్యత, నిల్వలు, పంపిణీ వివరాలతో పాటు మందుల గడువు తేదీలను తనిఖీ చేశారు. గడువు ముగిసిన మందులు వినియోగంలోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రోగుల వివరాలు, వైద్య సేవలు, రక్త నమూనా,మందుల నిల్వలు, మందుల పంపిణీ తదితర వివరాలను సంబంధిత రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్లె దవాఖానకు వచ్చే ప్రతి రోగికి అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలతో పాటు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పల్లె దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.అనంతరం కిన్నెరసాని గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపురం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు నిద్రిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్రంలో అందుతున్న సదుపాయాలు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా కార్యకలాపాల వివరాలను అంగన్వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు, వారికి ప్రతిరోజూ అందిస్తున్న ఆహార మెనూ, పౌష్టికాహార పంపిణీ, గుడ్ల పంపిణీ తదితర వివరాలపై ఆరా తీశారు.అనంతరం చిన్నారులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆహార నాణ్యత, తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి చిన్నారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, ఇతర పౌష్టికాహార పదార్థాల నిల్వలను పరిశీలించి వాటి నిల్వ విధానం, అందుబాటులో ఉన్న పరిమాణం, వినియోగానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అర్హులైన ప్రతి చిన్నారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రంలోని తరగతి గది, పరిసరాలు, వంట ప్రాంతం, తాగునీటి సదుపాయాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పాఠశాలలు, క్రీడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పల్లె దవాఖానల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థులు, చిన్నారులు, గ్రామీణ ప్రజలకు అందించే భోజనం, పౌష్టికాహారం, విద్య, వైద్య సేవలు, మందులు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తమ పరిధిలోని సంస్థలను తరచూ సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని, లోపాలు గుర్తించిన వెంటనే వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు, చిన్నారులు, ప్రజల నుంచి వచ్చే సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలని సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీలలో తహసీల్దార్లు ధారా ప్రసాద్, ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :