Wednesday, 16 September 2026 04:23:54 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 13 October 2025 04:04 PM Views : 586

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో సోమవారం పాత కొత్తగూడెం ప్రాంతంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులు, మద్యాహ్న భోజన వంటశాల, శానిటేషన్ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మద్యాహ్న భోజన వంటశాలలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, శుభ్రత, మరియు మెనూ వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర వహిస్తున్నందున, ప్రతి రోజూ నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. గుడ్లు, కూరగాయలు, పాలు వంటి పోషక పదార్థాలను తప్పక భోజనంలో చేర్చాలని ఆదేశించారు. కలెక్టర్ గుడ్లు వండుతున్నారా? అని ప్రశ్నించినప్పుడు సిబ్బంది, టెండర్ సంస్థ నుండి సరఫరా లభించలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లావ్యాప్తంగా ఉన్న యూఆర్‌ఎస్ (URS) మరియు కేజీబీవీఎస్ (KGBVS) పాఠశాలల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి, తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆహార సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా నాణ్యతతో కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాల పరిధిలోని మరుగుదొడ్లు, స్నానగదులు, హాస్టల్ గదులను కలెక్టర్ పరిశీలించారు. కొన్ని సెప్టిక్ ట్యాంకులు బ్లాక్ అయ్యి ఉన్నాయని సిబ్బంది తెలియజేశారు. వీటి మరమ్మతులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల ద్వారా వెంటనే చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను శుభ్రపరచి, దోమల పెరుగుదలను నివారించడానికి సమయానుకూల చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు, పాఠశాల విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ వంటి అంశాలను కలెక్టర్ సవివరంగా తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసినట్లు, ఈ సంవత్సరం కూడా అదే విధంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. పాఠశాల భవనం విద్యార్థుల సంఖ్యకు తగినంత కాకపోవడం అంశాన్ని సిబ్బంది వెల్లడించారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా చూడటం మన అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే పాఠశాలను నూతన భవనంలోకి మార్చడం లేదా కొత్త ప్రదేశంలో కొత్త భవనం నిర్మించడం కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఎలక్ట్రికల్ క్లీనింగ్ మెషిన్‌ను అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి, నేర్చుకునే ఉత్సాహానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. పాఠశాల పరిశుభ్రతలో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని బలంగా సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సెక్టోరియల్ అధికారి ఏ. నాగరాజ శేఖర్, ఏఈ రాజమౌళి, పాఠశాల ప్రత్యేక అధికారి రాంబాయి, బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :