Wednesday, 04 November 2026 10:08:14 PM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు.

Date : 03 July 2026 05:26 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 27వేల ప్రభుత్వ పాఠశాలల కుదింపుపై ఉద్యమిస్తాం.పెండింగ్‌ రూ.7 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలి.ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. ఖాళీగా వున్నాఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి.వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వరక అజిత్, బుర్ర వీరభద్రం, మంద నాగకృష్ణ, దుర్గం ప్రణయ్ డిమాండ్ చేశారు. జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సన్నాహక సమావేశం స్థానిక కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని శేషగిరి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యారంగానికి బడ్జెట్‌ను తగ్గించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలన్నారు. ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని, ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యాహక్కును పరిరక్షించుకోవడానికి జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పిడిఎస్యూ కొత్తగూడెం పట్టణ నాయకులు హర్ష వర్ధన్, సాగర్, నవీన్, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమ్ కుమార్, దిలీప్ కుమార్, విద్యాసాగర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సృజన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :