Thursday, 17 September 2026 06:09:34 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 13 September 2024 04:30 PM Views : 1746

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన TGWSW ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోకి మార్చిన షీ టీమ్స్ మరియు AHTU కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు.మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్ మరియు ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.

.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి కి పిలిచి వారి తల్లీదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.బాలికలకు,మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ను సంప్రదించాలని తెలియజేసారు.జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో,రైల్వేస్టేషన్,బస్టాండ్లు మరియు కళాశాలల వద్ద షీ టీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలను నిరోధించడం జరుగుతుందని అన్నారు.

AHTU (Anti human trafficking unit) మానవ అక్రమ రవాణాను నివారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం.మానవ అక్రమ రవాణా చేసి వారి అవయవాలను విక్రయించడం,వారితో వెట్టిచాకిరీ చేయించడం,వ్యభిచారంలోకి లాగడం,బాల్య వివాహాలు చేయడం లాంటివి జరగకుండా జిల్లాలో AHTU పని చేస్తుందని తెలిపారు.ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.మఫ్టీ దుస్తులలో సంచారిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో AHTU మరియు షీ టీం సిబ్బంది తిరుగుతుంటారని తెలిపారు.ఈ సంవత్సర కాలంలో షీ టీం మరియు AHTU బృందాలు కలిసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 47కు పైగా కేసులు,47 పెట్టీ కేసులు(RED HANDED),92 అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,శ్రీనివాస్ మరియు 1టౌన్ సీఐ కరుణాకర్,2టౌన్ సీఐ రమేష్, సైబర్ క్రైమ్స్ సీఐ జితేందర్,ఆర్ఐలు సుధాకర్,రవి,లాల్ బాబు,కృష్ణారావు షీ టీమ్స్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఆర్ఎస్సై రమాదేవి మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :