Sunday, 02 August 2026 09:31:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఆర్థోపెడిక్స్‌పై అవగాహన అవసరం. ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్ దాచేపల్లి సునీల్

Date : 10 March 2026 06:08 PM Views : 419

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన శరీరంలోని ఎముకలు, కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వైద్యశాఖనే ఆర్థోపెడిక్స్ అని కన్సల్టెంట్ వైద్యుడు డా. సునీల్ తెలిపారు. ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నష్టం పెరిగి మోకాలి మార్పిడి (నీ రీప్లేస్‌మెంట్) వంటి శస్త్రచికిత్సలు అవసరం అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. అయితే ప్రతి నొప్పికీ వెంటనే శస్త్రచికిత్స అవసరం ఉండదని, సరైన పరీక్షలు, చికిత్సలు, వ్యాయామం మరియు జీవనశైలిలో మార్పులతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని వివరించారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం మరియు శరీర బరువును నియంత్రణలో ఉంచడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఉత్తమం డా. సునీల్ (సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌).ఆర్థోపెడిక్స్ అంటే కేవలం ఫ్రాక్చర్లు లేదా మోకాళ్ల మార్పిడి మాత్రమే కాదని, ఇందులో స్పోర్ట్స్ మెడిసిన్ వంటి ముఖ్యమైన విభాగం కూడా ఉందన్నారు. లిగమెంట్ తెగినప్పుడు కీహోల్ పద్ధతిలో రిపేర్ లేదా రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే సాధారణ జీవితం గడపవచ్చన్నారు.గత 27 సంవత్సరాల అనుభవంలో ఆర్థోపెడిక్స్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం కీహోల్ సర్జరీ వంటి ఆధునిక సాంకేతికతలతో రోగులు తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారని తెలిపారు. ఈ విధానంతో శస్త్రచికిత్స చేసిన రోగి ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతి నెల రెండవ మంగళవారం రోజున కొత్తగూడెంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని డా. సునీల్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :