తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలకు నిరంతరం వార్తలను చేరవేస్తున్నఐ న్యూస్ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ, ఎస్సై భాదవత్ రవి తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఐ న్యూస్ యాజమాన్యానికి , మరియు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతు ప్రత్యేకంగా ఐ న్యూస్ రిపోర్టర్ తంబర్ల పుల్లారావు ని అభినందించారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని, భవిష్యత్తులో ఐ న్యూస్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ