Thursday, 17 September 2026 12:43:22 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి : జిల్లా ఎస్పి రోహిత్ రాజు

Date : 02 January 2026 05:13 PM Views : 325

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు. బాల కార్మికులు కనిపిస్తే 1098,డయల్ 100కు సమాచారం అందించండి : జిల్లా ఎస్పి రోహిత్ రాజు జనవరి 1 నుండి 31వ తారీఖు వరకు వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా పోలీస్ అధికారులు,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు.ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లయిన కొత్తగూడెం,పాల్వంచ,భద్రాచలం,ఇల్లందు,మణుగూరు లో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి,జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.ఆపరేషన్ -స్మైల్ XII కి సంబందించిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు,వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆపరేషన్ స్మైల్-XIఇ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ - XlI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,18సంవత్సరాల లోపు తప్పిపోయిన,కిరాణం షాపులు, మెకానిక్ షాపులలో,హోటళ్లలో, ఫ్యాక్టరీ లలో పనిచేస్తున్న బాల కార్మికులను మరియు వదిలివేయబడిన పిల్లలను,రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి,వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు.చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి హెచ్చరించారు.బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని,ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098,డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము,DWO స్వర్ణలత లెనినా,CWC సభ్యులు అంబేద్కర్,సాదిక్ పాషా,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ షర్ఫుద్దీన్,డీసీపీవో హరి కుమారి,చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్,అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ మాధవ రావు, KSCF కో-ఆర్డినేటర్ రాజేష్,కమిటీ మెంబెర్స్ షీ టీం ఎస్సై రమాదేవి,ఎస్సైలు విజయ,రాజేష్,సమ్మిరెడ్డి,రాఘవయ్య,లక్ష్మణ్,జిల్లా పరిధిలో ఏర్పాటు చేయబడిన ఆపరేషన్ స్మైల్-XII ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :