Friday, 18 September 2026 02:21:33 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 09 February 2026 07:55 PM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత తనిఖీ అధికారులను ఆదేశించారు.ఆహార వ్యాపారం నిర్వహించే ప్రతి దుకాణదారుడికి అవసరమైన లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత శిక్షణ కేంద్రాల ద్వారా వారికి ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల ఆసుపత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, వాటికి గల స్థానిక కారణాలను విశ్లేషించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఎక్కువగా ఎలాంటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని తెలిపారు.మొదటి దశలో జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ/ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారిపై ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులు, వినియోగదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, సేంద్రియ ఉత్పత్తులు, మిల్లెట్స్ ఆధారిత ఆహారాల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆహార పదార్థాల్లో రసాయనాల సాంద్రతను గుర్తించేందుకు చేపట్టాల్సిన పరీక్షల విధానాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రాబోయే శ్రీరామనవమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాల్స్, హోటళ్ల యజమానులకు ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా నాణ్యత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మధువరం ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :