తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను ముందస్తుగా జరుపుకున్నారు దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ మరియు ఉప సర్పంచ్ పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. విజేతలకు బహుమతుల ప్రదానం:మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాతల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది వారిలోమొదటి బహుమతి: చౌడం నరసింహారావు అందజేశారు.రెండవ బహుమతి: సాయిని శ్రీనివాసరావు ,మూడవ బహుమతి: గుండెపిన్ని కృష్ణారావు , నాలుగవ బహుమతి: సిరికొండ పెద్ద నరసింహారావు,ఐదవ బహుమతి: సిరికొండ తిరుమల రావు లు అందజేశారు. ఈ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లు మొదటి బహుమతి.పగిళ్ల సంయుక్త, రెండవ బహుమతి బత్తుల మౌనిక, మూడవ బహుమతి గంగావత్ ఐశ్వర్య, నాలుగో బహుమతి బానోత్ మహేశ్వరి, ఐద అలాగే, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో, కీ.శే. లక్ష్మీ ప్రసన్న జ్ఞాపకార్థం టి.ఎన్.ఆర్ (TNR) విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చౌడం నరసింహారావు,కొండలరావు, నాగేశ్వరరావు, బానోత్ బాలాజీ, తంబాల అజిత (స్కూల్ చైర్మన్ ),హెచ్.ఎం (HM), ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ గంగావత్ నవీన్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలలో భాగంగా మహిళలు, విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. బహుమతులు అందించిన దాతలకు, ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించిన TNR కి మరియు కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ