తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలో హెచ్.పీ గ్యాస్ 15 రోజుల నుంచి అందుబాటు లేకపోవడం వల్ల, మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని , ప్రజలు గ్యాస్ గోడం వద్దకు వస్తే తాళాలు వేసి అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల మండల ప్రజలు అవస్థలు పడుతున్నారని , జూలూరుపాడు హెచ్.పీ గ్యాస్ బినామీ పేర్లతో నడిపిస్తున్నారని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలానికి చెందిన వ్యక్తి తప్పుడు పత్రాలతో ఏజెన్సీ నిర్వహిస్తున్నారు అని సమాచారం, జూలూరుపాడు నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతి యువకులు జీవనోపాధికై దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా ఈ జిల్లాకు సంబంధం లేని బినామీలకు ఏ విధంగా గ్యాస్ ఏజెన్సీ అప్ప చెప్పారని నిజమైన అర్హులను గుర్తించి విచారణ జరిపి మండల ప్రజలకు హెచ్.పీ గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తక్షణమే విచారణ జరిపి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఏజెన్సీ పొందిన వారిపై చర్యలు తీసుకుని జూలూరుపాడు మండలంలో హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీని తెరచి ప్రజలకు అందుబాటులో ఉండే ల చూడాలని స్థానికులు మరియు కస్టమర్లు అధికారుల ను కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ