తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : తెలంగాణ రాష్ట్ర మిషన్ హెల్త్ -100 లో భాగంగా ఈరోజు దమ్మపేటలో జరిగిన హెల్త్ క్యాంప్ లో దమ్మపేట మండలంలో ఉన్న నిరుపేదలు ఈ క్యాంపులో పాల్గొని వారికి ఉన్న అనారోగ్యాలకు ఉచితంగా నిష్ణాతులైన డాక్టర్లచే చూపించుకుని మందులు తీసుకుంటున్నారు వారు ఈ క్యాంపు వలన మాలాంటి పేదలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ క్యాంపు పేదలకు చాలా ఉపయోగకరమని అన్నారు ఈ మిషన్ హెల్త్ క్యాంపుకు దమ్మపేట మండలం P H C డాక్టర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలైన శ్రీమతి యేసు మణి గారిని ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఈ క్యాంపులో వారు పాల్గొని డాక్టర్స్ తో మాట్లాడారు అలాగే ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు అందరూ కూడా ఈ క్యాంప్ మాకు చాలా ఉపయోగమని కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజా ప్రభుత్వమని ఇది ప్రజాపాలనని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ