తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల ప్రకారం ఈరోజు సాయంత్రం 4:30 కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధారా రమేష్ క్యాలెండర్ ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దీవెనలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ చారు గుండ్ల వెంకట నాగేశ్వరరావు, గేల్లా జగన్నాథం, పసుమర్తి అనంతం, వెచ్చా శ్రీరాములు, కొయ్యాడ నగేష్, బిక్కుమల్ల శ్రీనివాసరావు, వల్లాల శ్రీనివాస్, దారా ధీరజ్ , బలరాం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ