తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 1(తెలుగు వెలుగు) ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా జూలూరుపాడు మండలంలో భగత్ సింగ్ కాలనీ, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చండ్రుగొండ అడ్డా, పాపకొల్లు ఆటో అడ్డ గుండె పూడి వెంగ న్నపాలెం నర్సాపురం మాచినపేట కాకర్ల పాపకొల్లు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మే డే పతాకాన్ని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఎగురవేశారు అనంతరం వారు మాట్లాడుతూ రిజర్వేశారు ఆవిష్కరించారు వేడుకలు ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ కాలనీలో మే డే పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా నగరంలోని చికాగో పట్టణంలో కార్మికులు తమ హక్కుల కోసం ఎనిమిది గంటల పని దినం కావాలని సమ్మె చేస్తున్న కార్మికులపై సాయుధ బలగాలు ఒకేసారి గా కార్మికులపై విరుచుకుపడ్డారని, తుపాకీ గుండ్లకు బలై రక్తం చిందిస్తూ మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన తమ బట్టలను శ్రామిక శక్తులకు అండగా నిలిచే ఎర్రని జెండాగా ఎగురవేయడం జరిగిందని, వేలాది మంది రక్తం చిందిన రోజునే మేడే గా కార్మికులు ప్రపంచవ్యాప్తంగాజరుపుకుంటున్నారని, అమరవీరుల ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, sk నాగుల్ మీరా, గార్లపాటి వీరభద్రం ఎల్లంకి మధు సిరిపురపు వెంకటేశ్వర్లు, చెరుకుమల్ల రాజేశ్వరరావు వల్ల మల్ల సామేలు , కొండా వీరయ్య గుడిమెట్ల సీతయ్య, నిమ్మటూరి లచ్చయ్య దర్శనాల లక్ష్మీనారాయణ, కొండ వీరయ్య, కిలారు ముత్యాలు, sk చాంద్ పాషా బరగడ రమేష్ పత్తిపాటి మహేష్ గార్లపాటి శివకృష్ణ బర్ల బాబురావు, పసుపులేటి పవన్ తాతా నరసింహారావు, కత్తి గోపి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ