Monday, 03 August 2026 09:02:12 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 18 June 2026 07:24 PM Views : 158

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వన్యప్రాణులను తిలకించేందుకు ప్రత్యేక సఫారీ ట్రాక్‌ల ఏర్పాటు, పర్యాటకులను ఆకట్టుకోనున్న బటర్ ఫ్లై పార్క్.నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాం.త్వరలోనే హరిత హోటల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో అటవీశాఖ ద్వారా రూ.45 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు ప్రత్యేక సఫారీ వాహనాలను, బటర్‌ఫ్లై పార్కును, ఫీడ్ స్టోరేజ్ షెడ్‌ను, సీసీ రోడ్డును జిల్లా కలెక్టర్ అంకిత్'తో కలిసి అయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అయన మాట్లాడారు. పర్యాటకులు అడవిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించి జింకలు, వన్యప్రాణులు, పక్షులను నేరుగా చూసేలా ప్రత్యేక సఫారీ ట్రాక్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటకులు ఈ సరికొత్త సఫారీ రైడ్, బటర్‌ఫ్లై పార్కులను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందేవిధంగా అన్ని వసతులు అందుబాటులోకి తెచ్చామన్నారు. కిన్నెరసానిలోని బోటింగ్, జింకల పార్కును మరింతగా నవీకరిస్తామని చెప్పారు. క్రాస్ రోడ్డులోని హరిత హోటల్‌ను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని, దీనికి మరిన్ని నిధులు మంజూరు చేయించి, తుదిమెరుగులు దిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా ఫారెస్ట్ అధికారి క్రిస్ట గౌడ్, కిన్నెరసాని సర్పంచ్ వజ్ర రామకృష్ణ, సీపీఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, వైఎస్ గిరి, శ్రీను, ఖాసీం, బాబురావు, వెంకన్న చల్ల కృష్ణ, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :