తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ అన్నారు.78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద,బస్టాండ్ సెంటర్ లో,మథుర బస్తీ,గాజులరాజం బస్తీ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనం స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగిస్తున్నామని, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని,ఇక్కడ అన్ని కులాలు,మతాల వారు కలిసి,మెలిసి జీవించే గొప్ప లౌకిక దేశం అని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజలు జీవించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,బంటు నరేందర్,వినయ్,సోను,అనురాగ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ