Thursday, 17 September 2026 07:38:17 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

పాఠశాలల్లో ఆహార నాణ్యత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 June 2026 05:12 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు కళాశాల, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు. ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, బాలికలను తల్లిదండ్రులు లేదా అధికారికంగా అనుమతించిన సంరక్షకులతో మాత్రమే బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం కిచెన్ షెడ్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో నిల్వ ఉంచిన సరుకులను పరిశీలించారు. అనంతరం కిచెన్ షెడ్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్ మరమ్మతులు ఆలస్యమవుతున్న కారణాలను అడిగి తెలుసుకుని, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సందర్భంగా పప్పు పలుచగా ఉండటంతో పాటు నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం పరిశుభ్రంగా, పోషక విలువలతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. తాను మళ్లీ ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆహార నాణ్యతలో లోపాలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అత్యంత ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల పెంపుతో పాటు వారి ఆరోగ్యం, సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్ది విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరింత విశ్వాసం కలిగేలా విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, పోషకాహార నాణ్యతను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు . ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి,ఎంఈఓ జుంకీలాల్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :