తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలో కన్నుల పండుగగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,తుమ్మల నాగేశ్వరరావు . పాల్గొన్న టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు శ్రీనివాస గిరి పై వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలు , ఉచ్చరణతో గుట్ట ప్రాంగణమంతా వెంకటేశ్వరుని నామంతో మారుమ్రోగింది . కళ్యాణాన్ని తిలకించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వెంకటేశ్వరుని దయతో రాష్ట్రమంతా సిరిసంపదలతో పాడిపంటలతో కళకళలాడుతూ ఉండాలని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ,కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ