Monday, 03 August 2026 07:23:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సమగ్ర ప్రణాళికతోనే కొత్తగూడెం కార్పొరేషన్ పురోగతి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 19 July 2026 06:42 PM Views : 329

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? సమగ్ర ప్రణాళికతోనే కొత్తగూడెం కార్పొరేషన్ పురోగతి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి, సమన్యంతోనే ఆశించిన ఫలితాలు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రణాళికతోనే కొత్తగూడెం కార్పొరేషన్ పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో పనిచేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపనల బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారానే ప్రజా శ్రేయస్సు సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మంజూరైన ప్రతి ఒక్క పనిని నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పాలనా యంత్రాంగం నిరంతరం శ్రమించాలన్నారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరగాలని, సమిష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. స్థానిక అవసరాలను గుర్తించి నిధుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ టౌన్ దమ్మపేట సెంటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర రూ.14 కోట్లతో ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, మంచికంటి నగర్లో ఎస్ కే పి అపార్ట్మెంట్ నుండి ప్రధాన రహదారి వరకు రూ.50 లక్షలతో పక్కా రోడ్డు నిర్మిస్తున్నామని, కొత్తగూడెం పట్టణ పరిధిలోని పోస్టాఫీస్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి గోధుమ వాగు వరకు రూ.50 లక్షల నిధులతో డివైడర్లను అభివృద్ధి చేస్తున్నామని కూనంనేని తెలిపారు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి, కూనంనేని తోపాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు ఏ సాయిబాబా, వి విశ్వేశ్వరరావు, జీవిఆర్, శ్యామల, అన్నపూర్ణ, నామ కీర్తి, కూరపాటి సుధాకర్, బండి నరసింహ, దుర్గయ్య, బోయిన విజయ్ కుమార్, మునిగడప పద్మ, దాసరి శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, పడాల ఆకాంక్ష, మద్దాల హరిత, పి ధనలక్ష్మి, గడ్డం శాంతి ప్రియ, బి.కళావతి, కంచర్ల హిమశ్రీ, సహేరా బేగం, మంద నాగలక్ష్మి, నాయకులు కంచర్ల జమలయ్య, ఎండి యూసుఫ్, గడ్డం సతీష్ కుమార్, భవాని, సాంబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :