Monday, 03 August 2026 04:30:18 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్.

Date : 10 June 2026 06:12 PM Views : 112

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ ఆఫీసర్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ పాల్గొన్నారు.మొదటి విడతగా ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, శాంపిల్ సేకరణను వేగవంతంగా నిర్వహించడం, రోగులకు సరైన నిర్ధారణ చేసి తగిన చికిత్స అందించడంపై సూచనలు చేశారు.అనంతరం నర్సింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అవసరం లేని సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ANC పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీల ప్రత్యేక ప్రొఫైల్‌ను నిర్వహించాలని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిరంతర పరీక్షలు చేయించాలని తెలిపారు. అలాగే EDD క్యాలెండర్‌ను సక్రమంగా నిర్వహిస్తూ ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.గర్భిణీలలో రక్తహీనత (అనీమియా) గుర్తింపు, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గర్భిణికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గర్భిణీలకు తప్పనిసరిగా సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.మాతృ మరణాల రేటు (MMR), శిశు మరణాల రేటు (IMR) తగ్గించేందుకు ప్రతి గర్భిణికి సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. గర్భిణీలు యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండేలా ఆరోగ్య విద్య అందించాలని సూచించారు.ప్రసవానంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి తల్లికి అవగాహన కల్పించాలని, శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లి మరియు శిశు ఆరోగ్యానికి తల్లిపాలు అత్యంత ముఖ్యమని వివరించాలని సూచించారు.ప్రసూతి వార్డులు, లేబర్ రూమ్‌లలో అన్ని ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని, వార్డుల పరిశుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ, వ్యర్థాల వేరు వేరు నిర్వహణకు ప్రత్యేక బిన్లను వినియోగించాలని ఆదేశించారు.అదేవిధంగా OP, IP రిజిస్టర్లు మరియు ఇతర రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి నిర్వహించాలని సూచించారు. పాము కాటు, కుక్క కాటు మరియు ఇతర జంతువుల కాటు బాధితులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలనితెలిపారు.ప్రతి కేంద్రంలో "నార్మల్ డెలివరీ మోటివేషన్" వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజూ యోగా మరియు తేలికపాటి వ్యాయామాలపై అవగాహన కల్పించడం ద్వారా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నర్సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు.సమతుల్య ఆహారం (Balanced Diet) ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో సుమారు 50 శాతం కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, 25 శాతం ప్రోటీన్లు, 25 శాతం పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.జిల్లాలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఆరోగ్య విద్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకర జీవనశైలి, వ్యాయామం, పోషకాహారం ప్రాముఖ్యతను వివరించాలని నర్సింగ్ ఆఫీసర్లకు సూచించారు.ఈ సమావేశంలో మాతృ-శిశు ఆరోగ్య సేవల బలోపేతం, సాధారణ ప్రసవాల పెంపు, మాతృ మరియు శిశు మరణాల తగ్గింపు, అనీమియా నివారణ, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, తల్లిపాల ప్రోత్సాహం మరియు నాణ్యమైన వైద్య సేవల అందజేతపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సాయి కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ప్రతాప్, డా. రాందాస్, డా. దినేష్, డా. రాకేష్, డా. హరీష్ మరియు జిల్లాలోని నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :