Wednesday, 16 September 2026 09:51:18 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి. టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు.

Date : 15 June 2025 07:47 PM Views : 833

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించిన రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరం ముగిసిన సందర్భంగా జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి 3 ఇంక్లైన్ గ్రౌండ్ నందు ఈరోజు అండర్-15 బాల,బాలికలజిల్లాస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారితో పాటు జిల్లా నలుమూలల నుంచి 60 మంది బాల ,బాలికలు ఈ పోటీలలో పాల్గొనగా వివిధ కేటగిరీలలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో బాల, బాలికలు తలపడి సత్తా చాటి అత్యంత ప్రతిభ కనబరిచి గెలుపొందిన బాల,బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు బహుమతుల తో పాటు వేసవి శిక్షణ శిబిరం సర్టిఫికెట్ లను కూడాఅందజేశారు నాగ సీతారాములు ముందుగా వేసవి సెలవులను వృధా చేసుకోకుండా వేసవి శిక్షణ శిబిరం పాల్గొన్న బాల, బాలికలను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల,బాలికలు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనబరచాలని ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధి చేసేందుకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెడుతుందని అందరు కూడా ఈ పథకాలను సద్విని చేసుకుంటూ చదువుతోపాటు క్రీడాకారులుగా ఎదిగి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జి. యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ డి. వై.ఎస్.ఓ. పరంధామ రెడ్డి, కలెక్టర్ క్రీడలకు సంబంధించి ఏమి కావాలన్నా వెంటనే స్పందిస్తూ క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతిభవంతులైన క్రీడాకారులకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ , జిల్లా కలెక్టర్ సహకారం అందిస్తున్నారు ఇప్పటికే సుమారు లక్షల రూపాయలతో జిల్లా క్రీడా సంఘాలకు శిక్షణ సామాగ్రి అందజేశారు ఇంకేమైనా అవసరాలు ఉంటే జిల్లా ఒలంపిక్ సంఘం తరఫున కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అవి అందజేసే విధంగాకృషి చేస్తామని యుగంధర్ రెడ్డి తెలిపారు రెజ్లింగ్ కోచ్.పి.నిహారిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోజిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్, జిల్లా జూడోఅసోసియేషన్ అధ్యక్షులు ఆదినారాయణ, జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు కరీం పాషా పలు క్రీడా సంఘాల ప్రతినిధులు కోచ్ లు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :