Friday, 18 September 2026 04:21:10 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి,TUCI జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రావు

Date : 03 February 2026 06:01 PM Views : 312

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం (తెలుగు వెలుగు) : ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏధులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు 2026 ఫిబ్రవరి 12 న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస హక్కులు కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర బిజెపి తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని జరగబోయే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు పార్లమెంటులో మంద బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారని గోపాలరావు దుయ్యబట్టారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి యు సి ఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు రాయల సిద్దు, కార్మికులు రాధ స్రవంతి, స్వరూప, రమాదేవి, రజిత, శ్రావణి,సునీత, లక్ష్మి అరుణ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :