తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా,రైతులకు నష్టం కలుగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.ఇందులో భాగంగానే ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లాలోని అందరు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సంబంధిత శాఖల అధికారులతో కలిసి రైతులతో సమావేశమయ్యారు.అక్కడ పాల్గొన్న రైతులు ఎస్పీ గారికి తమ సమస్యల గురించి తెలియజేశారు.అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా గన్నీ బ్యాగులు,కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు సంబంధించి,ధాన్యాన్ని కప్పి ఉంచడానికి ఉపయోగించే తార్పాలిన్ పట్టాలకు సంభందించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు అండగా నిలబడాలని సూచించారు.ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులతో పాటు పోలీసు వారికి కూడా సమాచారం అందించాలని కోరారు.అనంతరం అక్కడ ధాన్యం కొనుగోలు విధానాన్ని,ధాన్యాన్ని గ్రేడింగ్ చేసే విధానాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సైలు రమాదేవి,రవి మరియు ఇతర శాఖల అధికారులు,సిబ్బందితో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ