Sunday, 02 August 2026 01:12:44 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్.

Date : 25 July 2026 08:49 PM Views : 58

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ధర్మేంద్ర ప్రధాన్'కు మరో శాఖా కేటాయించే ఆలోచన విరమించుకోవాలి.విద్యావ్యవస్థ ప్రక్షాళన తక్షణమే జరగాలి. విద్యార్థుల బలిదానాలకు పరిహారం ఇవ్వాలి.ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్, సీబీఎస్ఈ పరీక్షా పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాట విజయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్ తెలిపారు. శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. పేపర్ లీకేజీలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి లోకం నిర్వహించిన పోరాటాల దాటికి తలవంచి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. కేంద్ర విద్యాశాఖలోని నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడటమే కాకుండా, మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర విచారకరమన్నారు. లీకేజీ బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా, ఆయనకు భవిష్యత్తులోనూ ఎలాంటి మంత్రిత్వ శాఖనూ కేటాయించకూడదని డిమాండ్ చేశారు. కల్తీ లేని విద్యావ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రక్షాళన చర్యలు చేపట్టాలని, ఈ అంశంపై పార్లమెంటు వేదికగా సుదీర్ఘ చర్చ జరగాలని కోరారు. నీట్ అక్రమాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీల సంస్కృతిని అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూపాలని, ఈ అక్రమాలపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు కొనసాగించామని గుర్తుచేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :