Tuesday, 03 November 2026 06:49:18 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇటుకలు అందించడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక చర్యలు.

Date : 28 August 2025 05:46 PM Views : 503

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరియు ఉపాధి హామీ పథకం పనులకు నాణ్యమైన ఇటుకలను తక్కువ ఖర్చుతో అందించడానికి మణుగూరు మండలం దమ్మక్కపేట సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీ‌ఎస్) వద్ద ఫ్లై యాష్ వినియోగంతో నాణ్యమైన ఇటుకలు తయారీ విధానాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇటుకల తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరియు ఉపాధి హామీ పథకం పనులలో అధిక నాణ్యత కలిగిన నిర్మాణ సామాగ్రి అందించడం ప్రధాన లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు. ఫ్లై యాష్ వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ఉత్పత్తి తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని సమర్థవంతంగా వినియోగించి ఇటుకలని తయారుచేసి ఉపయోగించవచ్చని చెప్పారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా ఇటుకలను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరియు ఉపాధి హామీ పథకం పనుల్లో అధిక నాణ్యత కలిగిన నిర్మాణ సామాగ్రి అందించడం ముఖ్యమైనది అని, ఇసుక, సిమెంట్, ఫ్లై యాష్ మరియు మట్టి (క్లే) మిశ్రమాలతో ఇటుకలు తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలో, నాణ్యమైన ఇటుకలను అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. వీటిపై విస్తృత ప్రచారం జరగడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఇటుకల తయారికి దోహదం అవుతుందని, తద్వారా లబ్ధిదారులు నేరుగా లాభపడగలరని తెలిపారు. ఆగస్టు 30న బీటీపీ‌ఎస్‌లో మూడు మిషన్ల ద్వారా వివిధ మిశ్రమాలతో నాణ్యమైన ఇటుకలను తయారుచేసే విధానంపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడుతుంది అని, ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని శిక్షణ పొందవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీటీపీ‌ఎస్ చీఫ్ ఇంజనీర్‌లు, సూపర్డెంట్ ఇంజనీర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, గృహ నిర్మాణ విభాగ ఇంజనీర్లు, తాసిల్దార్, ఎంపీడీవో, ఏపీవో మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :