తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చాలెంజర్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని లక్ష్మీదేవీపల్లి కొమరయ్యకాలనీలో చాలెంజర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 18 సంవత్సరాలుగా చాలెంజర్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. కొమరయ్యకాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చాలెంజర్స్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ప్రతి ఏడాది అన్నదానం కొనసాగించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులు, స్థానికులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ