Monday, 02 November 2026 07:00:12 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 October 2026 03:19 PM Views : 409

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ జూలూరుపాడు మండలం నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రీ-సర్వే పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలు, గ్రామ సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాలను సర్వే, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. నల్లబండ బోరు గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,426 ఎకరాల భూమి ఉండగా, సుమారు 12.50 కిలోమీటర్ల మేర భూ రీ-సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయిస్తూ సర్వే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే సందర్భంగా ప్రతి భూమికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అవసరమైన సాంకేతిక పద్ధతులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. భూ సరిహద్దుల విషయంలో రైతులకు ఉన్న సందేహాలను క్షేత్రస్థాయిలోనే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం భూములకు సంబంధించిన రికార్డులు మరింత స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని రైతులతో కలెక్టర్ మాట్లాడి భూ రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు, వారి భూముల వివరాలు, సాగు చేస్తున్న పంటలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు భూక్యా పంతులు తనకు రెండు ఎకరాల భూమి ఉందని, అందులో ఒక ఎకరంలో పత్తి, మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. తన కుమారులు తనను పట్టించుకోవడం లేదని, వృద్ధాప్య పింఛన్ కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు రైతు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే దరఖాస్తును పరిశీలించి, అర్హత మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జూలూరుపాడు తహసీల్దార్ శ్రీనివాస్, సర్వేయర్, సర్పంచ్ జి. సింధు, రైతులు, సర్వే సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :