తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కబ్జాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సత్వరమే సర్వే చేపట్టి నివేదిక ఇవ్వాలి సహజ జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని, కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సుజాతనగర్ మండల పరిధిలోని సర్వారం - కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించనున్న డార్మిటరీ బ్లాక్, కిచెన్ షెడ్ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు జీవనాధారమైన సహజ జల వనరులు, చెరువు భూములను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దర్జాగా ఆక్రమించుకోవడం గర్హనీయమన్నారు. నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన చెరువుల భూములను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతి చెరువుకు పక్కాగా హద్దులు నిర్ణయించి, కబ్జాలను తొలగించి జల వనరులను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి, విద్యావ్యాప్తికి పెద్దపీట వేస్తున్నామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వారి పరిస్కారంకోసం కృషిచేస్తున్నామన్నారు. సుజాతనగర్ మండలానికి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించడం జారింది గుర్తుచేశారు. సర్వారం - కోయగూడెం ఆశ్రమ పాఠశాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మేయర్ మూడ్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్ సింగ్, సొసైటీ చైర్మన్ మండే హన్మంతరావు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపిడివో భారతి, ఐటిడీఏ ఈఈ మధుకర్, ఏఈ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, సర్పంచ్ రామనాధం, నాయకులు భూక్య దస్రు, సిపిఐ మిత్రపక్షల నాయకులు కోమారి హన్మంతరావు, జక్కుల రాములు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ