తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు కుటుంబానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం తన కార్యాలయంలో చెక్కు రూపంలో రూ.1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉండి మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు, ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ ఏవో మంజ్యా నాయక్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ