తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.అశ్వారావుపేట ప్రాంతంలో నూతన సబ్‌స్టేషన్లు, కార్యాలయ భవనాల నిర్మాణంపై సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి.భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ పరిధిలోని అశ్వారావుపేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, పలు విద్యుత్ సబ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా విస్తరణ, నూతన కార్యాలయ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, సర్వే, టెండర్ ప్రక్రియలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కొనసాగుతున్న పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిఅశ్వారావుపేట-2 పరిధిలోని నందమూరి కాలనీలో నిర్మిస్తున్న 220/132 , 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్ పనులను సీఎండీ పరిశీలించారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలని తెలిపారు.అశ్వారావుపేటలోని 220/132 కేవీ సబ్‌స్టేషన్ విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టతకు మౌలిక సదుపాయాల పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదనపు 33 కెవి సామర్ధ్య సరఫరా కొనసాగింపు పనుల పై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా 33/11 కేవీ నారాయణపురం సబ్‌స్టేషన్ విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. నూతన డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి చర్యలు అశ్వారావుపేటలో సుమారు 17 గుంటల విస్తీర్ణంలో ప్రతిపాదించిన నూతన డివిజన్ కార్యాలయ భవన స్థలాన్ని సీఎండీ పరిశీలించారు. కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, తదుపరి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆసుపాక నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరా పనుల పరిశీలన ఆసుపాక 400/220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులపై కూడా సీఎండీ సమీక్షించారు. ఈ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి, సంబంధిత సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చేపట్టిన అన్ని పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.అభివృద్ధి పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులన్నింటినీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో భేటీఈ పర్యటన సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో సీఎండీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కార్యాలయ భవనాల నిర్మాణం, విద్యుత్ సరఫరా మెరుగుదలకు సంబంధించిన అంశాలపై పరస్పరం చర్చించారు.విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం, సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని సీఎండీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో టీజీఎన్‌పీడీసీఎల్, జి. మహేందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, భద్రాద్రి కొత్తగూడెం, జె. భద్రు పవార్, డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్, పాల్వంచ, బి. వెంకటేశ్వర్లు, డివిజనల్ ఇంజనీర్, ఎంఆర్‌టీ అండ్ కన్‌స్ట్రక్షన్, వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, బి. వెంకటరత్నం, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్, అశ్వారావుపేట, జె. రాంబాబు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఎంఆర్‌టీ, కె. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్, వినాయకపురం తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ