Tuesday, 03 November 2026 12:52:10 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కేంద్రం మొండివైఖరివల్లే సమ్మె అనివార్యమైంది : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

Date : 26 September 2026 05:12 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజలను, బ్యాంకు ఉద్యోగులను ఇబ్బందిపెట్టే చర్యలు మానుకోవాలి న్యాయమైన డిమాండ్లు అంగీకరించి సమ్మెను నివారించండి ద్వైపాక్షిక ఒప్పందాలను రక్షించాలి బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా బ్యాంకింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే సమ్మె అనివార్యమై ప్రజల, బ్యాంకు ఉద్యోగులు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలిపారు, శనివారం మేయర్ మూడ్ గణేష్ తో కలిసి ఎస్ బి ఐ కొత్తగూడెం బ్రాంచిని సందర్శించి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు మొండివైఖరి విడనాడి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి సామాన్య ప్రజలు, ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. వారానికి 5 రోజుల పని విధానం అమలుపై ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్రం గత రెండున్నరేళ్లుగా ఆమోదించకుండా తొక్కిపెట్టడం దుర్మార్గమన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి చర్చలతో ఖరారైన పీఎల్ఐ విధానాన్ని మార్చి, కేవలం ఉన్నతాధికారులకే లబ్ధి చేకూరుస్తూ ఉద్యోగుల మధ్య అంతరాలు సృష్టించే కుట్రలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్రం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :