Monday, 02 November 2026 11:31:51 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పాఠశాల, ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

Date : 28 September 2026 02:12 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన బోధన, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అంకిత్ చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, ఉపాధ్యాయుల హాజరు, విద్యా ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ సేవలను పరిశీలించారు. ముందుగా చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను తనిఖీ చేసి విధులకు హాజరైన, సెలవులో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికలో నమోదైన వివరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆయా తరగతి గదుల్లో అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. వివిధ తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠ్యాంశాలపై వారి అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధన, వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు. పదో తరగతి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. ఇందుకు సరైన సమాధానం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు నిరంతరం పాఠ్యాంశాలను బోధించాలని, తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, గత విద్యా ఫలితాలు, ప్రస్తుత విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై అదనపు దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు పట్టికను కూడా కలెక్టర్ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్కరూ విధులకు సక్రమంగా హాజరవుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ల్యాబొరేటరీని పరిశీలించిన కలెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్‌తో మాట్లాడి రోగులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని, డెంగ్యూ నిర్ధారణ కిట్ల కోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టినట్లు సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అవసరమైన పరీక్షా కిట్లు, మందులు ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై సంబంధిత అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి, నర్సులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :