Monday, 02 November 2026 09:05:52 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జిల్లాలో ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం. ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలో ప్రత్యేక శిబిరాలు: జిల్లా కలెక్టర్ అంకిత్, ఐ.ఏ.ఎస్.

Date : 18 October 2026 06:04 PM Views : 95

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం – అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలో ప్రత్యేక శిబిరాలు: జిల్లా కలెక్టర్ అంకిత్, ఐ.ఏ.ఎస్. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగం (DFS) ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల (ULB) పరిధిలో "ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం" (Financial Inclusion Saturation Campaign) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, ఐ.ఏ.ఎస్. తెలిపారు.ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాల కవరేజీని పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, సామాజిక భద్రతా సేవలు అందేలా చూడటమే ఈ ప్రచార లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శిబిరాల్లో లభించే సేవలు: PMJJBY, PMSBY, APY పథకాల్లో అర్హులైన వారి నమోదు. PMJJBY, PMSBY ఖాతాలకు ఆధార్ సీడింగ్ (పెండింగ్‌లో ఉన్నచోట).బ్యాంకు ఖాతా లేని అర్హులకు, PVTG కుటుంబాలకు PMJDY ఖాతాలు తెరవడం. నిష్క్రియంగా ఉన్న PMJDY ఖాతాల పునరుద్ధరణ. PMJDY, ఇతర పొదుపు ఖాతాలకు రీ-కేవైసీ పూర్తి చేయడం సెంట్రల్ కేవైసీ (C-KYC) ఐడీల జనరేషన్.పొదుపు ఖాతాలు, లాకర్లకు నామినీ వివరాల నమోదు/నవీకరణ.ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు, డిజిటల్ మోసాల నివారణపై అవగాహన కల్పించడం."ఆప్కీ పూంజీ, ఆప్కా అధికార్" అవగాహన కార్యక్రమం: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై (బ్యాంకు డిపాజిట్లు, బీమా మొత్తాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు తదితరాలు) ప్రజలకు అవగాహన కల్పించడం. PM-కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC): అర్హులైన PM-కిసాన్ లబ్ధిదారులందరికీ KCC అందేలా దరఖాస్తుల సేకరణ.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) నమోదు: రాబోయే రబీ సీజన్‌కు KCC ఖాతాల సంతృప్తత లక్ష్యంగా రైతుల PMFBY నమోదు. RBI యొక్క UDGAM పోర్టల్, IRDAI యొక్క బీమా భరోసా పోర్టల్, SEBI యొక్క MITRA ప్లాట్‌ఫామ్ పై అవగాహన కలిగించడం.ప్రచార కాలంలో ప్రతి గ్రామ పంచాయతీ/ULB లో కనీసం ఒక శిబిరం నిర్వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బ్యాంక్ శాఖను కేటాయించి, శిబిరాల షెడ్యూల్‌ను అన్ని విభాగాలకు, బ్యాంకులకు ఇప్పటికే పంపడం జరిగింది.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) జిల్లా స్థాయి నోడల్ అధికారిగా ప్రచారాన్ని సమన్వయం చేసి, పర్యవేక్షిస్తారు. జిల్లాలోని అన్ని బ్యాంక్ శాఖల మేనేజర్లు, నాబార్డు డీడీఎం, డీఆర్‌డీఓ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, మండల, గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. శిబిరాల షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ/ULB పరిధిలోని అన్ని బ్యాంకు శాఖలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. శిబిరాల తేదీలు, ప్రదేశాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని, లబ్ధిదారులను సమీకరించాలని, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. శిబిరాల వద్ద కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని తెలిపారు."జిల్లాలోని అర్హులైన ప్రతి పౌరుడూ బ్యాంకింగ్, బీమా, పింఛను సదుపాయాలు పొందాలన్నదే మా లక్ష్యం. ప్రజలు తమ గ్రామంలో నిర్వహించే శిబిరానికి అవసరమైన పత్రాలతో (ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్, మొబైల్ నంబరు తదితర పత్రాలు) హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :