తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని ఇంజనీరింగ్ హాల్ నందు స్వేరోస్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్న సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వేరోస్ నెట్వర్క్ బలోపేతం చేయటం కోసం, పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఎన్నిక కాబడ్డ నూతన కమిటీ కూడా పని విధానాన్ని మెరుగుపరుచుకుంటూ స్వేరో పునర్నిర్మాణం చేస్తూ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోటుపాట్లను ప్రశ్నిస్తూ ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు చిలకపత్తిని వీరయ్య అన్నారు. అనంతరం ఎన్నిక కాబడిన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కమిటీ వారికి స్వేరో సుప్రీం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కృతజ్ఞతలు. అలాగే మా వంతుగా ఏజెన్సీ ప్రాంతంలో స్వేరోస్ నెట్ వర్క్ ఆశయాలను సిద్ధాంతాలను, ప్రచారం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను చదువు వైపు మళ్లిస్తూ వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీస్తూ వాళ్లకి తోడునీడగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ