Monday, 02 November 2026 11:30:54 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఉత్సవాలను విజయవంతం చేయాలి : కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 11 October 2026 05:29 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత. సకల జనులకు అమ్మవారి ఆశీస్సులు అందలి. అమ్మవారి కటాక్షంతో సుఖసంతోషాలు కలగాలి. పండుగలతో నూతన ఉత్తేజ, మానసిక ప్రశాంతత. భక్తులకు అసౌకర్యం కలగొద్దు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండలంలోని కేపీ జగన్నాధపురం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు, ఆధ్యాత్మిక భావన సమాజంలో మానసిక ప్రశాంతతను నింపుతాయన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, ఆలయ ఈవో విజయ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు డి సుధాకర్, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, నిమ్మల రాంబాబు, వీ పద్మజ, నాయకులు శనగారపు శ్రీనివాసరావు, బీవీ సత్యనారాయణ, బానోతు రవి, రంజిత్, గొర్లె నరేష్, సక్రు, రాందాస్, కిరణ్ కుమార్, అల్లి వెంకటేశ్వర్లు, సంజీవరావు, రామారావు, కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న, మహిపతి రామలింగం, బాలినేని నాగేశ్వరరావు, గంధం నరసింహారావు, బార్ల జోషి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :