Wednesday, 04 November 2026 02:08:15 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

విద్యార్థుల అభ్యసనకు అనుకూల వాతావరణం కల్పించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 05 October 2026 05:11 PM Views : 171

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్ఏ–1 పరీక్షల నిర్వహణను పరిశీలించిన కలెక్ట ర్ ప్రీ-ప్రైమరీ చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన అమలు పరిశీలన జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, పోషకాహారం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఏ–1 పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. వివిధ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించి, వారు రాస్తున్న ప్రశ్నపత్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయి తదితర వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు ఉండగా, సోమవారం 62 మంది విద్యార్థులు హాజరైనట్లు ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థుల హాజరు శాతం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని, గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు.పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చేపట్టిన పనులు, వాటి ప్రస్తుత పరిస్థితి, విద్యార్థులకు వాటి ద్వారా కలుగుతున్న ప్రయోజనాలపై వివరాలు తెలుసుకున్నారు.

చిన్నారులు ఆటల ద్వారా ఉల్లాసంగా నేర్చుకునేలా పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మలు, ఆట వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదుల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని, ఆటలు, బొమ్మలు, ఇతర అభ్యసన సామగ్రిని వినియోగిస్తూ చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఉదయం 11 గంటలకు రాగిజావ, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ, ఆహార పదార్థాలు, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను వంట నిర్వాహకురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు వారి హాజరు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు . ఈ తనిఖీలు కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ జుంకీ లాల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :