తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముదిరాజ్ కులాన్ని బీసీ–డి నుంచి బీసీ–ఏ జాబితాలోకి మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహేంద్ర (మేదరి) సంఘం డిమాండ్ చేసింది. ఈ మార్పు వల్ల ఇప్పటికే బీసీ–ఏ జాబితాలో ఉన్న 57 వెనుకబడిన కులాల రిజర్వేషన్ల ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం నాయకులు పోతు పురుషోత్తం, నాగకృష్ణ, కొంటూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ